కోదాడ పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఉన్న డబ్బా కొట్లు, మండపం ఏరియా లో ఉన్న డబ్బా కోట్లను తొలగించి తమను రోడ్డున పడవేయ్యా వద్దు అంటూ చిరు వ్యాపారలు మున్సిపల్ కార్యాలయం ముందు బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిరు వ్యాపారస్తులు మాట్లాడుతూ తాము గత 30 సంవత్సరాలుగా చిన్న, చిన్న డబ్బా కోట్లు ఏర్పాటు చేసుకొని కుట్టుమిషన్లు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నామని ఇప్పటికిప్పుడు తమన ఖాళీ చేస్తే తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ రాతపూర్వకంగా నూతనంగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ లో తమకు షాపులు కేటాయిస్తామని హామీ ఇస్తే సహకరించి ఖాళీ చేస్తామన్నారు. లేని పక్షాన బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే అందరం కలిసి అడ్డుకుంటామన్నారు………..
