ఏపీలో వితంతు పింఛనుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. వృద్ధాప్య పింఛను తీసుకునే భర్త మరణిస్తే వెంటనే భార్యకు పింఛను మంజూరు అయ్యేలా నిర్ణయించింది. భర్త ఒకటో తేదీ నుంచి 15 లోపు మరణిస్తే వెంటనే పింఛన్ ఇవ్వాలని, 15 నుంచి 30తేదీ లోపు చనిపోతే వచ్చే నెల నుంచి పింఛన్ అందజేయాలని స్పష్టం చేసింది.కుటుంబపెద్ద మరణిస్తే ఆర్థికంగా నలిగి పోకూడదని, ఆసరాగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది