సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం గ్రామంలో ఉన్న పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అనంతగిరి ఎంపీడీవో సుష్మ పరిశీలించారు. బుధవారం రైతులతో మాట్లాడి వివరాలు సేకరించుకున్నారు. సందర్భంగా మాట్లాడుతూ… రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అంశాలను పాటిస్తూ,17% లోపు ఉన్న రైతుల ధాన్యంనీ వెంటనే కాంటాలు నిర్వహించల్లన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి అందే సతీష్, ఆర్ ఐ లక్ష్మారెడ్డి, ఏఈవో వినోద్, సిఈవో నాగేశ్వరరావు, కార్యదర్శి అక్షయ తేజ, జొన్నల గడ్డ కోటేశ్వరరావు, సురేష్ తదితరుల పాల్గొన్నారు…
previous post