హత్నూర పోలీస్ స్టేషన్ పరిధి గడ్డివాము దగ్ధం . వివరాలకు వెళితే ఇలా ఉన్నాయి హత్నూర మండలం బోర పట్ల గ్రామానికి చెందిన కొండ్ల చంద్రయ్య, తన పశువుల మేత కోసం తన ఇంటి వద్ద గడ్డి వాము నిలువ ఉంచాడు. శనివారం గుర్తుతెలియని కొందరు వ్యక్తులు దగ్ధం చేశారని చంద్రయ్య, స్థానిక గ్రామస్తులు వివరించారు. తక్షణమే సంగారెడ్డి ఫైర్ స్టేషన్ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని గడ్డివాము దగ్ధమైన మంటలను ఫైర్ స్టేషన్ సిబ్బంది ఆర్పారు.అప్పటీకే గడ్డివాములు పూర్తిగా దగ్ధమైపోయిందని , 20 వేలకు పైగా నష్టపరిహారం జరిగిందని బాధితుడు చంద్రయ్య వివరించాడు.