మునగాల మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ & ఎం.ఎస్. పి. మండలఅధ్యక్షులు గుడిపాటి కనకయ్య,లంజపల్లి శ్రీను,ఆధ్వర్యంలో75వ భారతరాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడంజరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ సీఈవో మండల ప్రత్యేక అధికారి బి శిరీష,మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యున్నతమైన భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రసాదించి మహిళలకు హక్కులు కల్పించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటుహక్కును కల్పించి,బడుగుబలహీనవర్గాలకు మైనార్టీ వర్గాలకు విద్యా వైద్యం రాజకీయ అవకాశాలను కల్పించిన మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు అని,ఈసందర్భంగా కొనియాడినారు,ఈకార్యక్రమంలో పాల్గొన్న అందరితో అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది,ఈకార్యక్రమంలో మండల తహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాళ్, ఏపీవో శైలజ,పంచాయతీసెక్రెటరీ చంద్రశేఖర్,ఎమ్మార్పీఎస్& ఎంఎస్.పి. మండల ఇన్చార్జి లంజపల్లి శ్రీనుమాదిగ, మహాజనసోషలిస్ట్ పార్టీజిల్లా ప్రధానకార్యదర్శి కొత్తపల్లి అంజయ్యమాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజుమాదిగ,ఎమ్మార్పీఎస్ మండలఉపాధ్యక్షులు గద్దల అశోక్,ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ అధ్యక్షులు:గుడిపాటి కనకయ్య, మొలుగూరి శ్రీకాంత్, కొలికపంగు శ్రీను, ఎల్ వినయ్ కుమార్, ఎల్ వెంకటేశ్వర్లు, ఎస్కే కాసిం, తదితరులు పాల్గొన్నారు.