జిన్నారం మండల కేంద్రంలోని రంగరాముల గుట్ట పై స్వయబుగా వెలిసిన శ్రీ దేవి భూదేవి సమే రంగనాయక స్వామి దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు రంగరాముల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాలలో కార్యక్రమాలలో 16 జంటలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ ఉప సర్పంచ్ కోదండరామ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు భోజిరెడ్డి జిన్నారం మాజీ సర్పంచ్ గోకర్ జనార్దన్ గౌడ్ మరియు తాజా మాజీ ఎంపీటీసీ మరియు సర్పంచ్ వెంకటేశం గౌడ్ మాజీ ఎంపిటిసి నాగుల నర్సింలు ఈ కార్యక్రమంలో అన్నదానాన్ని నిర్వహించిన ఇంద్రసేనారెడ్డి నీలం నర్సింలు వడ్ల నాగభూషణం మహేందర్ రెడ్డి సింహ రెడ్డి బిక్షపతి గౌడ్ మున్ని నర్సింలు
పుట్టి వీరస్వామి పురోహితుడు వేదాంతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.