Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలి

సూర్యాపేట కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు, ఏ ఐ టి యూ సి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4లేబర్ కోడ్ లను తీసుకొస్తున్నారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయి. 8గంటల పనిని 12గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంబంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగంలో కార్మికొద్యమం మీద, కార్మిక ఐక్యత మీద దాడి చేస్తుంది. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికొద్యమం దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం 11 సంవత్సరాల కాలంలో రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందన్నారు. రైతాంగం పోరాటం సందర్భంగా ఇచ్చిన ఈ ఒక్క హామీని నేటికీ అమలు చేసిన పాపాన పోలేదన్నారు. స్వామినాథన్ సిఫారసులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టానికి రోజురోజుకు నిధులు తగ్గిస్తూ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. రెండు పూటలా ఉపాధి కార్మికులు హాజరు వేయాలని నిబంధన మూలంగా కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చేశారు. పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించి రోజు కూలి 600 రూపాయలు ఇచ్చి ప్రతి కుటుంబానికి 200 రోజులు పనులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏం. రాంబాబు , సాయి కుమార్, శివ కృష్ణ, దానేలు, వీరయ్య, కస్తూరి,ఏఐటీయూసీ జిల్లా నాయకులు

చామల అశోక్. షేక్ లతీఫ్ బురా వెంకటేశ్వర్లు నిమ్మల ప్రభాకర్ ఎస్ రాఘవరెడ్డి,ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి, కునుకుంట్ల సైదులు ఐఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు సామా నర్సిరెడ్డి, సూరారపు లక్ష్మణ్ ,పుల్లూరు సింహాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పులుసు సత్యం, జంపాల స్వరాజ్యం పాల్గొన్నారు.

Related posts

కార్యనిర్వాహణ అధికారిగా కే.వినోద్ బాధ్యతలు

TNR NEWS

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS

నేతన్న కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం   ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేతన్నలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వ చర్యలు 2 లక్షల చెక్కును అందించి నేతన్న కుటుంబాన్ని ఓదార్చిన ప్రభుత్వ విప్

TNR NEWS

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్

TNR NEWS

ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Harish Hs

కొమురం భీం జిల్లాలో భూ ప్రకంపనలు…

TNR NEWS