జగిత్యాల పట్టణంలోని స్థానిక రవీంద్ర ప్లే స్కూల్ లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పాఠశాల నిర్వాహకులు సుమన్ రావు, కిషన్ మరియు పాఠశాల డైరెక్టర్స్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు మరియు వివిధ దేవతలు స్వాతంత్ర సమరయోధులు మరియు కార్టూన్ పక్షులు, జంతువుల వంటి వివిధ వేషధారణలు మరియు చిన్నారులు రైతు ప్రాముఖ్యత మరియు అమ్మ నాన్న గొప్పతనాన్ని గురించి చేసిన నాటికలు పోషకులను మంత్రముగ్ధులను చేశాయి ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్సు బి శ్రీధర్ రావు బి హరిచరణ్ రావు కే సుమన్ రావు, జె. రాజు జె మౌనిక ,కే కిషన్ లతో పాటు పోషకులు ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.