కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని మండల విద్య వనరుల కేంద్రంలో కార్యాలయ ఆవరణలో శనివారం తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్షా యూనియన్ పిలుపు మేరకు – మద్నూర్ మండల సమగ్ర శిక్షా అభియాన్, కేజీబివి ఆధ్వర్యంలో రిలే నిరసన దీక్ష నిర్వహించడం జింగింది. ఇందులు భాగాంగా సమగ్ర శిక్షా అభియాన్ అధ్యక్షులు రవి కాంత్ మాట్లాడతూ. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని క్రమ బద్ధీకరణ హామిని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే పేస్కేల్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుక భాగంగా తపస్, పి ఆర్ టి యు నాయకుల ఆధ్వర్యంలో ఎస్ ఎస్ ఏ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ ఏ ఉద్యోగులు, తప్పస్ నాయకులు శివకాంత్, అజిత్ పవార్, సంజయ్ కుమార్, సత్యం, పి ఆర్ టి యు నాయకులు . సనీల్, బీమ్, శివరాం, మారోతి, సీమ శ్రినివాస్, ఈర్షద్ అలీ పి జి హెచ్ ఎం శంకరయ్య, నాగనాథ్, ఉపాధ్యాయులు గీతకు, కమలాకర్, సంజీవ్, మోహన్ , పాల్గొన్నారు.