మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, మాటేడు గ్రామం లో రాత్రి కురిసిన వర్షానికి రైతుల ధాన్యం తడవడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని రైతు పట్టాలో పోసి ఎండకు ఆరబెట్టడం జరిగింది.వర్షానికి తడిసిన దాన్యాంను కొనుగోలు దారులు కోనరానే భయం తో రైతు నడుములు గుంజంగా తన వడ్లను ఎండలో ఆరపోశాడు ఇటీవల పలు జిల్లా లో వర్షాలు పడుతయని వాతావరణ శాఖ చెప్పిన విషయం తెల్సిందే. అయితే అధికారుల నిర్లక్షానికి రైతులు బలి అవుతున్నారని రైతన్న ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు పనులు వేగవంతం చేసివుంటే మా వడ్లను ఇప్పటికే అమ్మేసి ఉండేవాళ్ళం. కాని ఇలా తడిసిన ధాన్యంతో ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన చెందారు. అకాల వర్షానికి వడ్లు తడవకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది.