May 19, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఎండలు పెరుగుతాయ్జా గ్రత్తగా ఉండాలి

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల 38 డిగ్రీల ఎండ నమోదవుతుంది.రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, వడగాలులు వచ్చే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.ఎండలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే నేరుగా ఎండ తగలకుండా టోపీ వంటివి పెట్టుకోవాలి లేదా వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. తెలుపు లేదా లేత రంగులు వాడాలి. కళ్లద్దాలు వాడాలి.ఎండలో బయటకు వెళ్లినప్పుడు కళ్లు తిరగడం, నీరసంగా అనిపించడం, వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నీడపట్టుకి వెళ్లాలి. ఇవి వడదెబ్బ లక్షణాలుగా గుర్తించాలి.మీ చుట్టుపక్కల ఎవరైనా ఎండకి నీరసించినట్టు కనిపిస్తే వెంటనే వారికి సాయం చేయాలి. నిమ్మరసం తాగించాలి. అవసరమైతే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి.ఎండలో బయటకు వెళ్లేటప్పుడు వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి. అలాగే బయట్నుంచి ఇంటికి వచ్చిన వెంటనే నిమ్మరసం, కొబ్బరి నీళ్ల వంటివి తాగుతుండాలి.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయట తిరగకుండా జాగ్రత్తపడాలి పిల్లలు, బాలింతలు, వృద్ధులను ఇంటి పట్టునే ఉండేలా చూసుకోవాలి. ఎండల్లో కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రిమ్స్ వంటివి తినడం తగ్గించాలి. అలాగే స్మోకింగ్, డ్రింకింగ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి.

 

Related posts

*మోడల్ స్కూల్( హెచ్ బి టి)  ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి*

TNR NEWS

8వేల ఎకరాల భూమిని గుర్తించాం:అదనపు కలెక్టర్

TNR NEWS

బకాయి కట్టకుంటే కరెంట్ కట్… బిల్లులు సకాలం చెల్లించాలి…

TNR NEWS

స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ సంఘటన సభ్యులకు ప్రత్యేక స్థానం కల్పించాలని మడుపు మోహన్ విజ్ఞప్తి

TNR NEWS

గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 9 వ వార్డు పరిశీలన

TNR NEWS

విద్యార్థుల మధ్యాహ్న భోజనం తనిఖీ 

TNR NEWS