పెద్ద గూడూరు మండలం :- మహబూబాబాద్ జిల్లా, స్థానిక గూడూరు మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల, మండల వ్యవసాయ అధికారి ఎండి. అబ్దుల్ మాలిక్, స్థానిక గూడూరు మండల తహసిల్దార్ సంగు శ్వేతా లు సందర్శించారు. రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేటప్పుడు ఎఫ్ఏ 2. నిబంధనలు తప్పకుండా పాటించి ప్రభుత్వం ఇచ్చే 500 బోనస్ ను పొందాలన్నారు. అంతే కాకుండా వర్షాభావ సూచనలు ఉన్నాయి కాబట్టి, రైతులందరూ వరి ధాన్యంపై తాడిపత్రిలు తప్పనిసరిగా కప్పుకోవాలని అన్నారు.