మద్దూర్ డిసెంబర్ 02(TNR NEWS) : మండల పరిధిలోని ఓ ప్రజా ప్రతినిధి దివ్యంగునిపై దాడికి పాల్పడ్డాడని బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నంది పహాడ్ గ్రామ పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దివ్యాంగుడైన గుర్రల్లి నరేష్ తండ్రి అంజిలప్ప పై అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి దాడి ఘటనపై దివ్యాంగుల హక్కుల జాతీయ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షురాలు రాధిక తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 100% కళ్ళు కనిపించని దివ్యగుడైన నరేష్ పై ఇంత దారుణంగా దాడి చేయడం సభబు కాదని ఈ దారుణానికి పాల్పడిన మాజీ ప్రజా ప్రతినిధి, ప్రజ సమస్యలను పరిష్కరించే బాధ్యత కలిగిన ఎంపీటీసీ గా పనిచేసిన వ్యక్తే ఇలాంటి దారుణానికి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. కావున అధికారులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి బాధితుడికి నాయ్యం చేకూరేలా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. లేనియెడల వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు.