నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, రైతు వేదికలు అన్ని ప్రభుత్వ సంస్థలకు తాగునీరు అందించేందుకు ప్రణాళికలో చేర్చాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి రూపొందించే కార్యచరణ ప్రణాళిక పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ..ఈ విషయమై ప్రత్యేక అధికారులు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.