కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేద్రం లోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఏఎంసీ ఛైర్మన్ సౌజన్య మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన మాతృమూర్తి సోనియాగాంధీ అని కొనియాడారు. ఆమె జన్మదినం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచారు. ఇందులో నాయకులు దరాస్ సాయిలు,సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ రామ్ పటేల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.