కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఉదయం 7:40 నిమిషాల ప్రాంతంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. కాగజ్నగర్, కౌటాల, చింతల మానేపల్లి, బెజ్జూర్ మండలాల్లో రెండు సెకండ్లు పాటు భూమి కoపించింది. దీంతో ఇళ్లలోని వస్తువులు కింద పడిపోయాయి. కొన్నిచోట్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. గమనించిన ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.