మునగాల మండల పరిధిలోని నరసింహ గూడెం గ్రామంలో ఆదివారం స్వామి వివేకానంద 162వ జయంతిని స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద యూత్ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్ది నాగరాజు గౌడ్ మాట్లాడుతూ.. భారతదేశ అవునత్యాన్ని,మరియు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజేసిన స్వామి వివేకానంద మన దేశంలో పుట్టడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామానికి చెందిన ఏఆర్ ఎస్సై ఉయ్యాల ఉపేందర్ మాట్లాడుతూ..ప్రపంచ దేశాల్లో భారత దేశ ఔన్నత్యాన్ని, సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడు అని అన్నారు. ఆయన బోధనలు నేటి యువతరానికి ఎంతో ఆదర్శమని చెప్పారు. యువత వల్లే భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు.చెడు మార్గాలకు దూరంగా మెలుగుతూ యువత రాబోయే తరానికి మార్గదర్శకంగా నిలవాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రధాన సలహాదారు మాజీ యూత్ అధ్యక్షులు తొండల.శ్రీకాంత్, గ్రామ యువనాయకులు మెంటేబోయిన.కృష్ణ ,మాజీ అధ్యక్షులు,ముసుకు రాజేష్ అధ్యక్షులు మజీద్, ఉపాధ్యక్షులు ముసుకు.ఫణిందర్, మూసుకు అనిల్,ఉయ్యాల ఉమేష్, అభిలాష్, దోడ్ల మహేష్, వినయ్ ,పెద్ది.సంపత్, పెద్ది. భీముడు, పెద్ది .సురేష్, చింతలపాటి అనిల్, కొప్పెర క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.