Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఈ నెల 7 న రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఆటోల బంద్ ను జయప్రదం చేయండి

 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆటో యూనియన్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7 తేదీన తలపెట్టిన రాష్ట్ర ఆటో ల బంద్ ను విజయ వంతం చేయాలని సూర్యాపేట ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కుర్రి సైదులు ప్రధాన కార్యదర్శి అహ్మద్ లు తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఈనెల 7న తలపెట్టిన బంధ్ కు సంబంధించిన పోస్టర్ ను ఆటో యూనియన్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో కార్మికుల కు ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఏడాదికి 12 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తికావస్తున్న ఇప్పటిదాకా ఎటువంటి హామీలు నెరవేర్చలేదన్నారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంతో ఆటో డ్రైవర్ల కు జీవనోపాధి కరువైందన్నారు. ఆటోలు నడుపుతున్న మాకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల కిరాయిలు లేక ఫైనాన్స్ లు కట్టుకోలేక వందలాది ఆటో డ్రైవర్లు ఆత్మ హత్య చేసుకుంటున్నారని ఆవేద వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహా లక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినందుకు ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఏడాది కి 15 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ నగరంలో ఆటో కొత్త పర్మిట్ లు ఇవ్వాలన్నారు. ఇప్పుడు ఇస్తున్న ఐదు లక్షల ప్రమాద భీమా బదులుగా పది లక్షలు ఇవ్వాలన్నారు. ఆటో కార్మికులు సహజ మరణానికి సైతం ఈ భీమా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులతో త్వరగా సంప్రదింపులు జరిపి సమస్యలు పరిష్కరించాలన్నారు. లేనిచో ఈనెల 7న తలపెట్టిన బంద్ ను పెద్ద ఎత్తున ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు

గుండె వెంకన్న,ఖుషి వెంకన్న పోతరబోయిన

శ్రీనివాస్, బొడ్డు సురేష్, కరుణాకర్, రాపర్తి రాజు, ఎండి అహ్మద్,మధు,సోమగాని బిక్షపతి, డి మార్ట్ అడ్డా సభ్యులు, అన్ని అడ్డాల ఆటో కార్మికులు పాల్గొన్నారు.

Related posts

వరంగల్: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అఘోరి 

TNR NEWS

30 వసంతాల అపూర్వ సమ్మెలనం

TNR NEWS

ఉపాధ్యాయ, విద్యారంగా, సామాజిక సమస్యలపై పోరాటమే ఎజెండా

Harish Hs

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి

TNR NEWS

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs

నూతన ఆలయాన్ని ప్రారంభించినసింగరేణి సంస్థ సిఎండి శ్రీ ఎస్ బలరాం

TNR NEWS