రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూటర్న్ ప్రభుత్వం అని బి ఆర్ ఎస్ యూత్ వింగ్ నాయకుడు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ అన్నారు. గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్ సీ సంతోష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర పాలనపై తీవ్ర విమర్శలు చేసారు. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్, యూటర్న్ ద్వంద వైఖరి, మోసపూరితమైన హామీలు నిస్సందేహమైన అబద్దాలతో ప్రజలను తెలంగాణను తప్పు త్రోవ పట్టించారాని, మహనీయుడు మహాత్మ జ్యోతి రావు పూలె ప్రజా భవన్ పేరు పెట్టి ఓకే ఒక్కరోజు ప్రజా భవన్ కి వెళ్లి ప్రజా పాలనలో యూటర్న్ ,నాకు కాన్వాయ్ అవసరం లేదు నేను మీలో ఒకడినే అన్న ముఖ్యమంత్రి మాటకు యూటర్న్, ముచర్లలో 14 వేల ఎకరాల ఫార్మసిటీ ఫ్యూచర్ సిటీ విషయం లో యూటర్న్, లగచర్ల ఫార్మసిటీ విషయంలో అది ఫార్మ కాదు ఇండస్ట్రియల్ కారిడర్ అని యూటర్న్, ఆదానికి 100కోట్లు రిటర్న్ ఇచ్చేయడంలో యూటర్న్, 6 గ్యారంటీలు 13హామీల విషయంలో యూటర్న్, హైడ్రా ఏర్పరిచి పేదవారి ఇండ్లను కూలగొట్టి అన్న తిరుపతి రెడ్డి ఇంటి విషయానికి వచ్చేసరికి యూటర్న్,రేషన్ కార్డు ల విషయంలో యూటర్న్, రెండు లక్షల జాబుల విషయంలో యూటర్న్, పెన్షన్స్ వవిషయం లో యూటర్న్ మహిళలకి నెలకి 2500 రూపయాల విషయంలో యూటర్న్ రుణమాఫీ విషయంలో దేవుళ్ళ సాక్షిగా మోసం,బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే ల ఇంటికి వెళ్లి వారిని కాంగ్రెస్ లో చేర్చుకొని అది కాంగ్రెస్ కండువా కాదు దేవుని కండువా అని చెప్పించి కోర్ట్ ని ప్రజలని తప్పుద్రోవ పట్టే విధంగా అబద్దం. ఇలా ప్రతి విషయంలో తెలంగాణ ప్రతిష్ట దిగజర్చే విధంగా తెలంగాణ ప్రజలు ఆర్ధికంగా కోలుకోలేని విధంగా చెర్యలు చెబేట్టుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం రాక్షస పాలనని తలపిస్తుంది అని అన్నారు. ప్రశ్నించే ప్రతిపక్షాలను అరెస్టు చేస్తా అనే ఆలోచన మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు.
previous post