Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కార్యదర్శులు అప్పులపాలు..!!

 

పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారు. గ్రామ పంచాయతీలో పాలకవర్గాల కాలపరిమితి తీరడంతో నిర్వహణ భారమంతా పంచాయతీ కార్యదర్శులపైననే పడింది.

 

ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో 10 నెలలుగా కార్యదర్శులు అప్పులు తెచ్చి పనులు చేయిస్తున్నారు. ప్రధానంగా బ్లీచింగ్‌, వీధి దీపాలు, మోటార్ల మరమ్మతు, ట్రాక్టర్‌ డీజిల్‌ తదితర ఖర్చులను సొంతంగా భరించాల్సి వస్తుంది.

 

*జిల్లాలో 844 పంచాయతీలు*

 

జిల్లాలో 844 గ్రామ పంచాయతీలున్నాయి. పంచాయతీలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిధులు వచ్చాయి. ఎన్నికల ముందు నుంచే రాష్ట్ర నిధులు ఆగిపోయాయి. పంచాయతీల్లో చేపట్టాల్సిన అత్యవసర పనులకు సర్పంచ్‌లు అప్పులు తెచ్చి నిర్వహించారు. ఫిబ్రవరి 2వ తేదీతో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిపోయింది. ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు పంచాయతీలకు పైసా నిధులు ఇవ్వలేదు. దీంతో అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

 

*రూ.25 కోట్ల వరకు ఖర్చు*

గ్రామ పంచాయతీల్లో అత్యవసరమైన పనులు వెంటనే చేపట్టాలని ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేక అధికారులను నియమించింది కానీ పైసలు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులే గ్రామాల్లో పనులకు సొంతంగా డబ్బులు వెచ్చిస్తున్నారు. పది మాసాల నుంచి నిధులు రాకపోవడంతో వారంతా అప్పులపాలవుతున్నారు. గతంలో సర్పంచ్‌లు ఉన్న సమయంలో అన్నీ వారే చూసుకునేవారు. ఇప్పుడు ఆ భారం కార్యదర్శులపైనే పడింది. చిన్న పంచాయతీల్లో అయితే.. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు, పెద్ద పంచాయతీల్లో రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇలా జిల్లాలో కార్యదర్శులు సుమారు రూ.25 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

*ఫ 10 నెలలుగా పంచాయతీలకు ఆగిన నిధులు*

*ఫ అత్యవసర పనులకు సొంతంగానే ఖర్చు*

 

ఫ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి వేడుకోలు

 

*నిధులు ఇవ్వాలని విన్నవించాం*

 

పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేస్తున్నారు. నిధులు విడుదల చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, డీపీఓ, పంచాయతీ అధికారికి తమ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రాలు సమర్పించాం. ప్రభుత్వం కూడా త్వరలోనే నిధులు ఇస్తానని సంఘ నేతలకు హామీ ఇచ్చింది. త్వరగా ఇవ్వాలని కోరుతున్నాం.

– *ఖాసీం, టీఎన్‌జీఓ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు*

కార్యదర్శులు అప్పులపాలు!

Related posts

సాయి గ్రామర్ పాఠశాలలో ఘనంగా 194 వ సావిత్రిబాయి పూలే జన్మదినవేడుకలు

TNR NEWS

పదోన్నతి పొందిన ఏఎస్ఐకి సన్మానం

Harish Hs

కొండగట్టులో వైభవంగా గోదా దేవి కళ్యాణం  హాజరైన ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం

TNR NEWS

మేధావుల సంఘీభావ సభకు తరలిరావాలి

Harish Hs

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

Harish Hs

బడ్జెట్ లో వ్యవసాయ కార్మికుల, పేదల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం..  ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS