కోదాడ లోని యం.యస్ జూనియర్ కళాశాల లో విద్యార్థుల తో ముఖా ముఖి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని, ఆ దిశగా క్రమ శిక్షణతో చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని,తల్లి దండ్రులు తమ పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించాలని,అధ్యాపకులు పాఠ్యాంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని,విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదివి తల్లి దండ్రులకి,కళాశాలకు మంచి పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో యం యస్ విద్యా సంస్థల సీ ఈ వో యస్ యస్ రావు,అధ్యాపకులు గంగాధర్, ఇనుద్దీన్, కె.శ్రీనివాస్ ,యం.శ్రీనివాస్ రావు సునీత,కల్పన,విజయ భాస్కర్,వీర స్వామి తదితరులు పాల్గొన్నారు.