మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామం లో గ్రామపంచాయతీ సమీపంలోని హనుమాన్ టెంపుల్ దగ్గర గల రావి చెట్టును కోతుల బెడద వలన కొందరు వ్యక్తులు చెట్టును పూర్తిగా తొలగించాలని చూస్తున్నారని, హిందూ ధర్మ రక్షణ సభ్యులు రావి చెట్టును రక్షించాలని గ్రామంచాయతిలో కార్యదర్శి కి శుక్రవారం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా హిందు ధర్మ రక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ కోతుల బెడద కారణం చెప్పి ఎంతో పవిత్రమైన దేవుని దగ్గర ఉన్న రావి చెట్టును కొందరు వ్యక్తులు పూర్తిగా తొలగిస్తామనడం బాధకరమన్నారు. ఈ చెట్టును తొలగించాలని చూసిన వ్యక్తికి గాయాలపాలైనడని గుర్తు చేశారు. హనుమాన్ గుడి దగ్గర ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం, షమీ పూజ , దసరా, నూతనంగా అమ్మవారిని ప్రతిష్టించుకొని ఘనంగా దసరా ఉత్సవం జరుపుకుంటున్నామని , అంత పవిత్రమైన చెట్టును కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందు ధర్మ రక్షణ సమితి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.