సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చని పరకాల ఏసిపి సతీష్ బాబు అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం నీరుకుల గ్రామంలో కార్డెన్ సెర్చ్ లో భాగంగా పరకాల ఏసిపి సతీష్ బాబు, ఆత్మకూరు సీఐ సంతోష్, పరకాల సిఐ క్రాంతి కుమార్, ఆత్మకూర్ శాయంపేట పర్కాల ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీసులు ఇంటింటి తనిఖీలు నిర్వహించారు. 25 వాహనాలకు ధృవీకరణ పత్రాలు, అది వాహనాలకు 32 వందల పెనాల్టీ వేశారు. గుడుంబా విక్రయదారులు కావటి లక్ష్మీనరసు, ఆశ్మీరా వెంకటేష్, నుంచి గుడుంబా స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. అనంతరం ఎసిపి మాట్లాడుతూ ప్రజలకు ఏ అవసరం వచ్చిన డయల్ 100 కు, ఫోర్ జి నివారణ, సైబర్ మోసాలకు ప్రజలు మోసపోవద్దని ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. అనుమానితులు గ్రామాల్లో తిరుగుతుంటే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మీ గ్రామస్తులు అందరూ కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అప్పుడే పూర్తి స్థాయిలో నేరాలు నియంత్రణ జరుగుతుందన్నారు. గ్రామస్తులు ఎప్పటికప్పుడు పోలీసు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్డెన్ సర్చ్ లో వంద మంది పోలీసులు పాల్గొన్నారు

previous post