కోదాడ: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన నిర్వహించే కోదాడ కోర్టులలో నిర్వహించే లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకొని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి , మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కే. సురేష్ కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్ వున్న కేసులలో కక్షిదారులు రాజీ పడడం వల్ల వారి సమయం, ధనం ఆదా అవుతాయన్నారు. లోక్ అదాలత్ నిర్వహణ పై శనివారం కోదాడ కోర్టులో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు అధ్యక్షతన న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ పై కక్షిదారులకు న్యాయవాదులు, పోలీసులు అవగాహన కల్పించాలని సూచించారు. రాజీ పడతగిన కేసులలో ఇరు వర్గాలు రాజీ పడి తమ కాలాన్ని, ధనాన్ని ఆదా చేసుకోవకడమే కాక, వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. లోక్ అదాలత్ ను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కే. భవ్య, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ చిత్తలూరి సత్యనారాయణ, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి, ఏపీ పీ లు సిలివేరు వెంకటేశ్వర్లు, కల్యాణి, సీనియర్ న్యాయవాదులు సాధు శరత్ బాబు, తాటి మురళీ, నాళం రాజన్న, మందా వెంకటేశ్వర్లు, కోడూరు వెంకటేశ్వరరావు, హేమలత, కోదండపాణి, దొడ్డ శ్రీధర్, జూనియర్ న్యాయవాదులు శరత్ కుమార్ , ఆవుల మల్లికార్జున్, పెద్దబ్బాయి, ఎస్ ఐ లు రంజిత్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఏ ఎస్ ఐ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.