నెక్కొండ మండలంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎమ్మార్పీఎస్ సమావేశం ఏర్పాటు చేయడం సమావేశానికి సభాధ్యక్షులుగా బిర్రు సుదర్శన్ మాదిగ మాజీ మండల అధ్యక్షుడు సమావేశానికి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా దళితరత్న కళ్ళపెళ్లి ప్రణయదీప్ మహాజన సోషలిస్ట్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు తడుగుల విజయ్ మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ నర్సంపేట నియోజకవర్గం కో కన్వీనర్ మండల ఇన్చార్జి నెక్కొండ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ. డిసెంబర్ 11ననెక్కొండ మండలం ఎమ్మార్పీఎస్ ధర్మ యుద్ధ సమావేశం విజయవంతం చేయండి. నెక్కొండలోని అన్ని గ్రామాల మాదిగ మాది ఉపకులాల ప్రతినిధుల హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలి
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలులోకి తీసుకువచ్చిన తరువాతనే ఉద్యోగాలు భర్తీ చేయలి
సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ వర్గీకరణ అమలులో చేయడంలో దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలబెడతామని అసెంబ్లీ లో ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను. నిలబెట్టుకోలేదని అన్నారు . ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసి మాదిగలకు ద్రోహం చేశాడని అన్నారు . ఎస్సీ రిజర్వేషన్ కేటగిరిలోని టీచర్ పోస్టుల్లో 80%పైగామాలలకే చెందాయని అన్నారు. రేవంత్ రెడ్డి మాలల ఒత్తిడికి తలొగ్గి ఎస్సీ.కేటగిరి ఉద్యోగాలన్ని మాలలకు దోచిపెడుతున్నాడని అన్నారు. తక్షణమే ఉద్యోగాల భర్తీ నిలిపివేయాలని అన్నారు. ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ కు ఎస్సీ వర్గీకరణను వర్తింప జేస్తామని అవసరమైతే అందుకు ఆర్డినెన్సు తీసుకువస్తామని అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ ప్రకటనకు ఎందుకు కట్టుబడి లేడు అని ప్రశ్నించారు. కమిటీలు, కమిషన్ల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి. అప్పటి వరకు ఉద్యోగ నియామకాలన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమ ప్రతినిధులు మారం పెళ్లి కొమ్మాలు మాదిగ. ఇదంపాక ప్రకాశం మాదిగ శ్యామ్ మాదిగ మల్లయ్య మాదిగ ఈదునూరి ప్రభాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.