మునగాల మండలం నారాయణగూడెం అంగన్వాడి,ప్రభుత్వ పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. గురువారం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు విద్యతో పాటు పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని సూపర్వైజర్ సరిత, పంచాయతీ కార్యదర్శి రజిత తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడి కేంద్రాలకు పంపి అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.