ఉట్నూర్ : మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఆదివారం 1993-94 ఎస్ఎస్సి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.. సమ్మేళన కార్యక్రమానికి పూర్వ ఉపాధ్యాయులు నారాయణ, భాస్కర్, రమేష్, ఆనందిశ్వర్, గంగామణి, చంద్రయ్య, రమేష్, వీరయ్య, రాజిరెడ్డి లు పాల్గొన్నారు. ముందుగా పూర్వ విద్యార్థులు గురువులను ఘన స్వాగతం పలికారు.. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.అనంతరం నిర్వహించిన సమావేశంలో పూర్వ అధ్యాపకులు వారి అనుభవాలను, అనుభూతులను విద్యార్థులతో పంచుకున్నారు. ఏళ్ల తరవాత కలిసిన పూర్వవిద్యార్థులు ఒకరిని ఒకరు కలూసుకుంటూ పాత జ్ఞపకాలను నెమరువేసుకున్నారు..రోజంతా ఆనందంగా గడిపారు.అనంతరం అధ్యాపకులను సన్మానించారు .కార్యక్రమం లో పూర్వ విద్యార్థులు ఆదిల్ షేక్, సంబన్న, dt చిన్నయ్య, డాక్టర్ శ్రీధర్, రాజానర్సింలు, రహేమాన్, అజీమ్, దేవిదాస్, సరితా, మంజుల, రజిని, అనిత తదితరులు పాల్గొన్నారు.