డీజీఎం లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పుల్లయ్య మాట్లాడుతూ అన్ని మతాల సంప్రదాయాలు, విలువలు విద్యార్థులకు తెలియజేయడం ఎంతో అవసరం అన్నారు. ప్రతి పండుగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం ఎంతో అవసరం అన్నారు. అన్ని మతాలు మంచినే బోధిస్తాయని విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి మతం యొక్క సాంప్రదాయాలు విలువలను కాపాడటం మన అందరి కర్తవ్యం అన్నారు. క్రిస్మస్ ప్రత్యేకత గురించి విద్యార్థులకు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.