దేశవ్యాప్తంగా రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు కోదాడకు వచ్చిన త్రిపుర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ కు వినతిపత్రం అందించి సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, టోల్గేట్ ధరలతో రవాణా రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. 15 సంవత్సరాల కలపరిమితి తర్వాత వాహనాలను రద్దు చేయడంతో చిన్న, చిన్న యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెట్రోల్,డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని అన్ని సమస్యలపై పార్లమెంటులో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం కోదాడకు వచ్చిన సందర్భంగా వారిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వారి వెంట డాక్టర్ బ్రహ్మం, కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, పత్తిపాక జనార్దన్ తదితరులు పాల్గొన్నారు……..