కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో గ్రామాల్లో రైతులు ఎలమాస పండుగను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగ సందర్భంగా రైతు కుటుంబాలు పోలెలు, రకరకాల కూరగాయలు, పప్పులతో ప్రత్యేక వంటకాలను చేశారు. ఉదయాన్నే కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో పొలాల్లోకి వెళ్లారు. పొలాల్లో భూదేవి అమ్మవారికి పాలు పొంగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది ఎలమాస పండుగను నిర్వహిస్తామని రైతులు తెలిపారు. మద్నూర్ మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ఎలమాస పండుగను జరుపుకొన్నారు. ఉదయాన్నే పొలాల్లోకి వెళ్లిన రైతన్నలు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. మద్నూర్ మండలం రాచూర్ గ్రామంలో ఎలా మాస పండుగను ఘనంగా జరుపుకున్నారు.
next post