కాంగ్రెస్ నాయకుడు మాజీ వార్డ్ సభ్యుడు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు, గాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 9 వ వార్డులో పర్యటించారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, గాజుల శ్రీనివాస్ పాల్గొని వారు మాట్లాడుతూ నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలు దశలవారీగా నెరవేరుస్తుందని ఇల్లు లేని నిరుపేదలకు ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని ఇంటింటి సర్వేకు వచ్చిన అధికారులకు లబ్ధిదారులు సహకరించాలని కోరారు, బిఆర్ఎస్ పార్టీ కేవలం మాటలకే పరిమితమైందని కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పరిపాలన చేస్తూ అందరి మన్నన పొందుతుందని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సబ్బని నరేష్, సాహేద్, గుంటుకు యాదగిరి, అస్గర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు