కామారెడ్డి జిల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సోయా పంటకు మద్దతు ధర కల్పిస్తూ బిచ్కుంద సింగిల్ విండో ఆధ్వర్యంలో నాబార్డు ద్వారా బిచ్కుంద మార్కెట్ యార్డులో కొనుగోలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన సోయా వాపసు రావడంపై రైతులు ఆందోళన చేపట్టారు.రైతలు మాట్లాడతూ….తేమశాతం చూశాకే కొన్నారని, ఇప్పుడేమో బాలేవని తిప్పి పంపించడమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ బిచ్కుంద మండల కేంద్రంలో ఆదివారం రైతులు ధర్నాకు దిగారు.బిచ్కుంద మండలం గోపన్ పల్లి రైతులకు చెందిన 3 లోడ్ల లారీల సోయాలో తేమ శాతం సరిపోలేదని తిరిగి వాపసు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నిబంధనల ప్రకారమే తాము సోయాలు అమ్మామని కొనుగోళ్ల అనంతరం రైతులకు ఇలా వాపసు చేయడం సరియైన విధానం కాదంటూ విమర్శించారు.వాపసు పంపిన సొయా ను ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.