కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్ పేట్ మండలకేంద్రం లోని కొండపల్లి గ్రామంలో ఏం ఆర్ ఓ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. అంగన్వాడీ భవనం కొరకు ప్రభుత్వ స్థలము లేనందున గ్రామ పెద్దలతో చర్చించి ఎవరైనా దాతలు ఉంటే స్థలము ఇవ్వాలని చర్చించారు, బేబ్బర్ల చంద్రు స్థలము ఇస్తానని చెప్పినారు. దాత కోరిన మేరకు స్థలము పరిశీలన చేయడం జరిగిందనీ, పెంచికల్ పేట్ సెక్టార్, సిర్పూర్ ప్రాజెక్ట్, ఎస్ కె హసీనా మేడం తెలిపారు.