మండల కేంద్రంతో పాటు, మండలంలోని అన్ని గ్రామాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎగురవేసిన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఆదివారం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు, పోలీసు స్టేషన్, రాజకీయ పార్టీల కార్యాలయాలు, ఆసుపత్రులు, యువజన సంఘాలు, అంగన్వాడీ కేంద్రాలు తదితర కార్యాలయాలపై జాతీయ పతకాన్ని ఎగురవేసి జనగణమన గీతాన్ని ఆలపించారు.