భావితరం వారసులుగా విద్యార్థులు న్యాయ సేవలు పై అవగాహన పెంచుకొని చదువుపై దృష్టి సారించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ,సీనియర్ సివిల్ జడ్జి పి శ్రీవాణి అన్నారు.శనివారం మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలో గల మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల, కళాశాలలో కోదాడ మండల లీగల్ సెల్ చైర్మన్,సీనియర్ సివిల్ జడ్జి సురేష్ తో కలిసి ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకుంటే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ముఖ్యంగా కళాశాలలో యువత ఏమాత్రం తప్పటడుగు వేసిన భవిష్యత్తులో జీవితం అంధకారంగా మారే అవకాశం లేకపోలేదు అన్నారు.అందరికీ న్యాయం రాజ్యాంగం కల్పించిన హక్కు అని చట్టాలు, ఉచిత న్యాయ సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.మత్తు పదార్థాలు,బాల్య వివాహాలు,పిల్లల్ని పనిలో పెట్టుకోవడం,మూఢనమ్మకాలు,వరకట్నం వేధింపులు వాటికి దూరంగా ఉండాలన్నారు.ఈ సందర్భంగావిద్యార్థులకు వివిధచట్టాలపై అవగాహన కల్పించారు.అనంతరం పాఠశాల ఆవరణలో భోజన శాల,హాస్టల్ గదులుపరిశీలించి ప్రిన్సిపాల్ కు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చిత్తలూరి సత్యనారాయణ,కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కే మూర్తి,సూర్యపేటఅధ్యక్షులుసుదర్శన్ రెడ్డి,కోదాడ ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు,సెక్రటరీ చింతకుంట్ల రామిరెడ్డి,ప్రిన్సిపాల్ శోభారాణి,వైస్ ప్రిన్సిపల్ గోపాలకృష్ణ,మల్లయ్య,న్యాయవాదులు ఉయ్యాల నరసయ్య,మంద వెంకటేశ్వర్లు,రాజు,హేమలత, తాటి మురళి, చలం,సత్యనారాయణ, వెంకటరత్నం, ప్రవీణ్ కుమార్, వాణి తదితరులు పాల్గొన్నారు……..