బీసీ కులాల హక్కుల కోసం కోదాడ పట్టణాన్ని వేదికగా చేసుకొని జిల్లా వ్యాప్తంగా అనేక పోరాటాలు చేసిన పిల్లుట్ల శ్రీనివాస్ సేవలను గుర్తించి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పిలుట్ల శ్రీనివాస్ ను నియమించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం పిల్లుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ..తనపై నమ్మకంతో రాష్ట్ర కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత కొన్ని ఏండ్లుగా తన జీవితాన్ని బీసీ కులాల హక్కుల కోసం ఆర్ కృష్ణయ్య అలుపెరగని పోరాటం చేస్తున్నారని,బీసీల సమస్యలపై ఆర్.కృష్ణయ్య పిలుపుతో ఏ ఉద్యమానికైనా సిద్ధంఅన్నారు.రాజ్యధికారంలో వాటా కన్నా చట్టసభల్లో బీసీలకు 50 శాతం ఇవ్వాలని, కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బడుగులకు 21 సీట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్ కృష్ణయ్య ఆదేశాలతో చట్టసభల్లో 50 శాతం వాటా కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని, గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేసి బీసీ సంఘాలను మరింత పటిష్టం చేస్తామని పిల్లుట్ల శ్రీనివాస్ తెలిపారు…..