చిలుకూరు మండల కేంద్రంలోని స్థానిక సాయి గ్రామర్ పాఠశాల నందు శుక్రవారం తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి ని నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ గవిని ఆంజనేయులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చదువులతల్లి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పునస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం ఎంతో హర్షించదగిన విషయం అని అన్నారు. అదే విధంగా వారి యొక్క జీవిత చరిత్రను పాఠశాల విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయునులు జి ఉమ, దీప్తి, నిర్మల, బి ఉమ, అనూష విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
previous post