Tnrnews.in
తెలంగాణ

వార్షిక తనిఖీల్లో భాగంగా చింతలమానపల్లి పోలీసుస్టేషన్ ను తనిఖీ…  కాగజ్నగర్ డిఎస్పి రామానుజం… పెండింగ్ కేసులను వీలైనంత తొందరగా పరిష్కరించాలి….

కాగజ్నగర్ సబ్ డివిజన్ పరిధిలోని చింతలమానపల్లి పోలీస్ స్టేషన్ ను ఆదివారంనాడు కాగజ్నగర్ డిఎస్పి రామానుజన్ వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీ చేసారు. పోలీసు స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాదీనంలో ఉన్న వాహనాల వివరాలు అడిగారు. పోలీస్ స్టేషన్ లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. వారికి కేటాయించబడిన విధులు అడిగి తెలుసుకున్నారు. సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సిసిటిఎన్ఎస్ లో పొందుపరచాలన్నారు. పెండింగ్ కేసులపై సమీక్ష చేసారు. వాటికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. నమోదైన సైబర్ నేరాల గురించి తెలుసుకున్నారు. విసిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల వారీగా పోలీసు స్టేషన్ పరిధిలోని అన్నీ గ్రామాలకు పోలీసు అధికారులను కేటాయించాలని ఆదేశించారు.

నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేసారు. పోలీసు స్టేషన్ లో అన్ని రకాల విధులను సక్రమంగా నేర్చుకోవాలన్నారు. రికార్డ్ నిర్వహణ, సీసీటీఎన్ఎస్, రిసెప్షను, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, సమన్లు మొదలుగు విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలన్నారు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని తెలిపారు.

రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విగ్రహావిష్కరణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి……..  అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే……..

TNR NEWS

కార్యదర్శులు అప్పులపాలు..!!

TNR NEWS

సిల్వర్ డేల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి ● ఆ స్కూల్ బస్సుల వరుస ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో, ఎంఈఓ లకు ఫిర్యాదు చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

TNR NEWS

కన్నుల పండువగా అయ్యప్ప మహా పడిపూజ

TNR NEWS

యలక రత్తమ్మ మృతికి నివాళులర్పించిన జర్నలిస్టులు సూర్యాపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ యలక రా మిరెడ్డి తల్లిగారు, టిఆర్ఎస్ నాయకులు

TNR NEWS

సర్వే కు ప్రజలు పూర్తి సమాచారం ఇవ్వాలి  బి.శ్రీనివాస్,కమీషనర్ 

TNR NEWS