గజ్వేల్ పట్టణంలో ఉన్న బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్ హాస్టల్స్ సందర్శించిన యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాదం తిరుపతి. మాట్లాడుతూ నూతన మెనూ మొదలైన కూడా అమలుకు నోచుకోలేని పరిస్థితి గజ్వేల్ హబ్ హాస్టల్లో ఉందన్నారు. స్కూల్ హాస్టల్స్ వార్డెన్ లు సమయానికి రావట్లేదని విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతు, బియ్యంలో పురుగులు ఉండడంతో విద్యార్థులు ఉదయం సమయంలో బయట టిఫిన్ చేసి వస్తున్నారన్నారు. నాసి రాకపు భోజనం పెడుతూ నీళ్ల చారు పోస్టు, రాత్రి మిగిలిన చారు ఉదయం టిఫిన్ లోకి వాడుతున్నారన్నారు. నూతన మెను అమలు చేయమంటే డబ్బులు ఎక్కువగా అవుతున్నాయని పాత మెను పెడుతు, ఈ హాస్టల్స్ ని పై అధికారుల తనిఖీలు లేవన్నారు. వందల మంది ఉన్న విద్యార్థులకు న్యాయం చేయలేని వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని లేనియెడల విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు నాచారం శేఖర్, డివిజన్ నాయకులు తిమ్మాపురం యాదగిరి, సందీప్, నిఖిల్ , దినేష్ తదితరులు పాల్గొన్నారు.

next post