November 17, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

“సమయ సద్వినియోగంతో సత్ఫలితాలు”

కే.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోదాడలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ మరియు హార్ట్ ఫుల్ నెస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో

విద్యార్థులకు రెండో రోజు “హెల్ప్” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 

కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వేముల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా హార్ట్ ఫుల్ నెస్ సంస్థ సెంట్రల్ కో-ఆర్డినేటర్ కె .శివరామ ప్రసాద్ పాల్గొని “సమయ సద్వినియోగం” అనే అంశంపై మాట్లాడారు. ప్రణాళికతో విద్యారులు ముందుకెళ్లాలని అన్నారు. ప్రతిరోజు మన మెదడులో 70వేల ఆలోచనలు వస్తాయని,మంచివి ఉంచుకొని,మిగతావి తీసివేయాలనిఅన్నారు.కొంతసేపు చదివి,కొంతసేపు సాధన చేయాలన్నారు. అలాగే ప్రతిరోజు ధ్యానంతో ఒత్తిడిని అధిగమించ వచ్చని ఆయన అన్నారు. సమూహంలో కూడా ఏకాగ్రతను కలిగి ఉన్నప్పుడు జ్ఞాపక శక్తి పెరిగి మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమం రేపు కూడా ఒక గంట సేపు జరుగుతుందని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వేముల వెంకటేశ్వర్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జి. యాదగిరి, వి .బల భీమారావు, జి.నాగరాజు, ఆర్ .రమేష్ శర్మ, యం.రత్నకుమారి,పి. రాజేష్, బి. రమేష్ బాబు,జి.వెంకన్న, పి. తిరుమల, ఎస్. గోపికృష్ణ, ఎం.చంద్రశేఖర్, సైదులు,ఎస్. కే. ముస్తఫా, ఎస్ .కే .ఆరిఫ్, ఎన్ .రాంబాబు, కె.శాంతయ్య, ఆర్. చంద్రశేఖర్, ఎస్. వెంకటాచారి, జ్యోతి, మమత, డి.ఎస్. రావు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

వడ్ల కోనుగోలు కేంద్రం ప్రారంభం

TNR NEWS

విమాన ప్రమాద ఘటన పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎర్నేని వెంకటరత్నం బాబు

Harish Hs

చట్టాలపై ప్రతి పౌరుడు కనీస అవగాహన కలిగి ఉండాలి

TNR NEWS

ఎమ్మార్పీఎస్ వెంకటరామాపురం గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Harish Hs

విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెడితే జైల్ ఊచలు లెక్క పెట్టాల్సిందే

Harish Hs

పోలీస్ కార్డన్ అండ్ సెర్చ్,38 వాహనాలు సీజ్

TNR NEWS