జగిత్యాల రూరల్ మండల్ పరిధిలోని టి ఆర్ నగర్ గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జెల్ల రవీందర్ ఆధ్వర్యంలో గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరు గురు గోవింద్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం సిగ్గు సోదరులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో నాగు పోలోజీ శ్రీనివాస్, కొండా వేణు, ఎస్.కె సిరాజ్,దస్తగిరి, ముద్దిన యాదగిరి,ప్రేమసింగ్,సిక్కు సోదరులు పాల్గొన్నారు.