మెట్ పల్లి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. రెండవ రోజైన గురువారం అఖండ దీపారాధన, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణం, బలిహరణం, హోమము, ప్రత్యేక అభిషేకం కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం భక్తులు సామూహికంగా భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పరిమి నర్సయ్య, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

next post