ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి మిల్లర్ల దోపిడీ నుంచి రైతులను కాపాడాలని అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం కోదాడ ఆర్ డి ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీవో సూర్యనారాయణకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ క్వింటాకు 2400 ధర చెల్లించి కొనాల్సిన ధాన్యాన్ని మిల్లర్లు కుమ్మక్కై కేవలం 2000 రూపాయలకే కొనుగోలు చేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బోరాలలో రైతులు తీసుకువస్తున్న ధాన్యానికి 70 కేజీల చొప్పున లెక్క కట్టి కేజీ కటింగ్ తీయడంతో పాటు అదనంగా 5 కేజీల కటింగ్ చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా హమాలీలు, గుమస్తా చార్జీల పేరిట బస్తాకు 17 రూపాయలు చొప్పున ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అదేవిధంగా మిల్లర్లను పిలిచి రైతులకు నష్టపోకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో అఖిలపక్ష రైతు సంఘం నాయకులు బొల్లు ప్రసాద్, దొడ్డ వెంకటయ్య, బద్దం వెంకటరెడ్డి, మెదరమెట్ల వెంకటేశ్వరరావు, ధరావత్ రాముజీ, గోపి, ఉదయగిరి, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు…….

previous post
next post