కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.సోమవారం బిచ్కుంద మరియు మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయం మార్కెట్ కమిటీ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షుడు ధరస్ సాయిలు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ఏఎంసి చైర్మన్ సౌజన్య రమేష్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాలుగోన్నారు.