Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వండి

ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాయామం తోటే చక్కటి ఆరోగ్యం లభిస్తుందని కోదాడ పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానం, ఆహార పదార్థాల కల్తీ,ఉరుకుల,పరుగుల జీవితాలతో, మానసిక ఒత్తిడి వల్ల అనేక ఆనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలన్నారు. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం పలు రకాల వ్యాధులను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య, కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, పొట్ట జగన్మోహన్ రావు, పందిరి రఘువర ప్రసాద్, విద్యాసాగర్, గడ్డం నరసయ్య, చిగురుపాటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు………

 

Related posts

అనసూర్యమ్మ మరణం బాధాకరం… సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు…

TNR NEWS

*చలితో రాష్ట్రం గజగజ..!!*

TNR NEWS

ఎమ్మార్పీఎస్ వెంకటరామాపురం గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Harish Hs

తమ్మర లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోదాడ మండల నాలుగో మహాసభ

TNR NEWS

గడ్డి వాము దగ్ధం

TNR NEWS

ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి లో కొత్త రికార్డు సృష్టించిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట

TNR NEWS