తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటిఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 13న ఆదివారం కోదాడ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా గల బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించే మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు తమ కుటుంబ సభ్యులు హెల్త్ కార్డుతో వచ్చినట్లయితే హైదరాబాద్ మెడివిజన్ కంటి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు జరిపి శాస్త్ర చికిత్సలు అవసరమైన వారికి హైదరాబాద్ లో అదే రోజు చికిత్స చేయించి ఉచితంగా వాహనం ద్వారా స్వస్థలాలకు పంపించడం జరుగుతుందని ఇట్టి అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు……………..

next post