మునగాల మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూములను గతంలో ఇందిరమ్మ ఇళ్ల కు కేటాయించిన మిగిలిన ఖాళీ స్థలాలను గుర్తించి మరియు గ్రామ కంఠం భూములను సర్వే చేయించి అర్హులైన వారికి ఇట్టి స్థలాలను ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లకు ఖాళీ స్థలం లేని నిరుపేదలకు కేటాయించాలని మండల తహశీల్దార్ వి. ఆంజనేయిలుకు వినతిపత్రం అందజేసిన నరసింహా పురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యంగా నరసింహ పురం లో ఉన్న గతంలో ఇందిరమ్మ ఇళ్ల కు కేటాయించిన స్థలంలో మిగిలిన స్థలాలను గుర్తించి సర్వే చేయించి లబ్ధిదారులకు కేటాయించాలని అదే విధంగా మండల పరిధిలోని ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల తో పాటు ఇళ్లు మంజూరు చేసి వారికి న్యాయం చేయాలని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు. ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్న సందర్భంగా ప్రస్తుతం ఖాళీ స్థలం ఉన్న వారికి మాత్రమే ఇల్లు నిర్మించుకోవడానికి. మాత్రమే అవకాశం కల్పించిన నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి ఇల్లు ఖాళీ స్థలం కూడా లేకుండా అద్దె ఇళ్లలో ఉంటున్న అర్హులైన నిరుపేదలకు ఈ పథకం వర్తించక నష్టపోయే ప్రమాదం ఉంది.కావున అట్టి అర్హులైన లబ్ధిదారులకు గతంలో గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిన స్థలంలో మిగిలిపోయిన స్థలాలను మరియు ప్రభుత్వ భూములను గ్రామ కంఠం భూములను గుర్తించి సర్వే చేయించి అర్హత కలిగిన లబ్ధిదారులకు. ప్లాట్ లను కేటాయించి అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రాజకీయాలతో సంబంధం లేకుండా వారికి ఇళ్లు మంజూరు చేసి వారికి న్యాయం చేయాలని తహశీల్దార్ ను కోరినట్లు సత్యనారాయణ తెలిపారు.