Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మునగాల ఎంపీఓ గుండెపోటుతో మృతి

మునగాలమండల పంచాయతీ అధికారి(ఎంపీఓ)గా విధులు నిర్వర్తిస్తున్న దార శ్రీనివాస్(53) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు.సోమవారం మండలంలోని తిమ్మారెడ్డిగూడెం గ్రామపం చాయతీ కార్యదర్శి జావీద్ ఆహ్వానం మేరకు చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెంలో రంజాన్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. భోజనం అనంతరం బాత్రూమ్కు వెళ్లిన శ్రీనివాస్ గుండెపోటుకు గురికావడంతో పంచాయతీ కార్యదర్శులు హుటాహుటిన కారులో కోదాడకు తరలించారు. కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాస్ స్వస్థలం హుజూర్ నగర్ కాగా కోదాడలో స్థిరనివాసం ఉంటున్నారు. ఎంపీఓ శ్రీనివాస్ మృతి పట్ల ఎంపీ డీఓ కె.రమేష్ దీనదయాళ్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, పలువురు పంచాయతీ కార్యదర్శులు సంతాపం ప్రకటించారు.

Related posts

దైవత్వాన్ని పరిచయం చేసే త్రైత సిద్ధాంత భగవద్గీత

TNR NEWS

మండల రైతాంగానికి పోలీసువారి విజ్ఞప్తి ధాన్యం సేకరణ ,ఆరబెట్టడం, అమ్మకాలలో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదం పొంచి ఉంది రైతులు, ట్రాక్టర్ డ్రైవర్ల జాగ్రత్త వహించాలి . మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్

TNR NEWS

పాఠశాల వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్

TNR NEWS

ఐఎంఏ అధ్యక్షులు గంగాసాగర్ కు సన్మానం 

TNR NEWS

కోదాడ మాతా నగర్ లో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు……..

TNR NEWS

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

TNR NEWS