సూర్యాపేట: ఈనెల 23,24 తేదీలలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే ప్రజానాట్యమండలి ప్రజా సాంస్కృతిక సంబరాలను జయప్రదం చేయాలనిప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల వెంకన్న పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రజానాట్యమండలి జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ నాలుగవ రాష్ట్ర మహాసభల సందర్భంగాఈనెల 23 ,24 తేదీలలో సంగారెడ్డిలో జరిగే ప్రజా సంస్కృతిక సంబరాల సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కళారూపాలు ప్రదర్శించడం జరుగుతుందన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రదర్శన కోసం వెళుతున్నకళాకారునికి బస్సు సౌకర్యం కల్పించాలని అన్నారు.50 సంవత్సరాలు పైపడ్డ కళాకారులకు నెలకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందిరమ్మ ఇండ్లలో కళాకారులకుఅవకాశం కల్పించాలని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మినీ రవీంద్ర భారతి ఆడిటోరియంనిర్మించాలని డిమాండ్ చేశారు. దీనికోసం రాబోయే కాలంలో పోరాటాలకు ప్రజానాట్యమండి కళాకారులు, జానపద కళాకారులుసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి రాంబాబు, ఉపాధ్యక్షులు మామిడి నాగ సైదులు ,పఠాన్ మహబూబలి ,సహాయ కార్యదర్శినందిపాటి సతీష్, జిల్లా కమిటీ సభ్యులు దున్నభిమన్యు ,జనంపల్లి సాయికుమార్ ,కందుకూరి శ్రీకాంత్ పాల్గొన్నారు.
previous post