November 17, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

డబ్బా పాలు వద్దు తల్లిపాలు ముద్దు

మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో రెండవ అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా,తల్లిపాలు అమృతం లాంటిది ప్రతి బిడ్డకు కచ్చితంగా తల్లిపాలు తాగించడం ఆరోగ్యానికి శ్రేష్టమని,ఈ విధంగా చేయడం వలన తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని రోగనిరోధక శక్తి పెంచుకొని దృఢంగా ఉండడం ఆయురారోగ్యాలతో ఉంటారని ఏఎన్ఎం నాగమణి అన్నారు.బుధవారం జరిగిన తల్లిపాల వారోత్సవాల అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. తల్లిపాలలో ఉన్న పోషకాలు శిశువులను ఆరోగ్యంగా దృఢంగా పెంచుతాయని తెలిపారు.పుట్టిన గంట లోపల ప్రారంభించి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని అలాగే రెండు సంవత్సరాల వయసు వరకు క్రమం తప్పకుండా తల్లిపాలను అందించడం అత్యవసరమని వివరించారు.తల్లిపాల వల్ల చిన్నారులు ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉంటారని శారీరకంగా మానసికంగా బలంగా ఎదుగుతారని పేర్కొన్నారు.అలాగే అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పాలు గుడ్లు పౌష్టికాహారం అందిస్తామని ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు.ఈకార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ బుర్రి శైలజ, ఆయా,ఆశావర్కర్లు దొంతగాని నాగమణి,కందుకూరి మరియమ్మ,చిన్నారులు గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆపరేషన్ సింధూరం అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తున్న మాజీ ఐఏఎస్ అధికారులు కోదాడ ప్రభాస ఆత్మీయ సమితి సభ్యులు

TNR NEWS

రైతులపై మొండి వైఖరి చూపెడుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

Harish Hs

ప్రతి విద్యార్థిని ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి సిఐ జగడం నరేష్

TNR NEWS

జాతీయస్థాయిలో అవార్డు అందుకున్న తమలపాకుల సైదులు.

Harish Hs

_పెద్దగట్టు జాతర సందర్భంగా జాతీయరహదారి (ఎన్ హెచ్) 65 పై వాహనాల మళ్లింపు కు రూట్ మ్యాప్ విడుదల చేసిన సూర్యాపేట జిల్లా పోలీసు_

Harish Hs

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోదిత దినోత్సవ వేడుకలు* ….

Harish Hs